08:36
Feb 26, 2024
1
1
'గోదావరి మెగా ఆక్వాపుడ్ పార్కుని వ్యతిరేకిస్తున్నందుకు విశ్వమానవవేదిక వృద్ధాశ్రమంపై దాడికి కిరాయి మూకలు # పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పంపించారని బెదిరింపులు # రెండున్నర గంటల పాటు భయం గుప్పిట్లో గడిపిన వృద్ధులు # దాడి చేసేందుకు సిద్ధమవుతున్నారని ఫిర్యాదు చేసిన స్పందించని పోలీసులు విశ్వమానవవేదికపై విషం చిమ్ముతున్న పాలకొల్లు ఎమ్మెల్యే రామానాయుడు తన చిల్లర రాజకీయాలు కొనసాగిస్తున్నారు. విశ్వమానవేదిక వృద్ధాశ్రమంపై కిరాయి మూకాలు దాడి చేశారు. ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? గోదావరి మెగా ఆక్వా పుడ్ పార్కుని అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరికలు..బెదిరింపులకు దిగారు. 2016, అక్టోబరు ఒకటో తేది సాయంత్రం 4.30 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పాలకొల్లులో ఉన్న విశ్వమానవవేదిక వృద్ధాశ్రమానికి ర్యాలీగా వచ్చి దళిత సంఘాల పేరుతో కొందరు కిరాయి మూకలు ధర్నా చేశారు. వృద్ధాశ్రమంలో వృద్ధులను గెంటివేసి దుర్భషలాలకు దిగారు. కేవలం డబ్బులు ఇచ్చి ఇక్కడ ధర్నాకు పంపించారని కొందరు మహిళలు తెలిపారు. విశ్వమానవవేదిక నిత్యాన్నదానంలో భోజనం ప్యాకెట్ తీసుకుంటున్న ఒక ఆమెని కూడా ధర్నాకు డబ్బులు ఇస్తామని తీసుకొచ్చారు. ఆమె విశ్వమానవవేదికకు వచ్చిన తర్వాత జరిగిన తప్పు తెలుసుకుని నాకు అన్నం పెడుతున్న సంస్థని ఇబ్బంది పెట్టేందుకు వచ్చినందుకు సిగ్గుపడుతున్నానని ఆవేదన వ్యక్తం చేసింది. కొంతమంది మాత్రం ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మనుషులమని వృద్ధులను గెంటివేసి వృద్ధాశ్రమం దగ్గర హల్‌చల్ చేశారు. పాలకొల్లు పోలీసులకు ఈ విషయంపై ఫోన్‌లో సమాచారం అందించినా స్పందించలేదు. నరసాపురం డిఎస్పీ పూర్ణచంద్రరావు గారికి తెలియజేస్తే పంపిస్తానని చెప్పారు. ఎంతకీ పోలీసులు రాకపోవడంతో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు గారు ఫోన్లో నరసాపురం డిఎస్పీతో మాట్లాడి పంపించాలని చెప్పారు. చివరకి వారంతా వృద్ధాశ్రమం నుంచి ఆ సంఘాలు వెనుతిరిగన తర్వాత పోలీసులు వచ్చారు. దాదాపు 70 మంది అల్లరిమూకలు విశ్వమానవవేదిక దగ్గరకు వచ్చి రభస చేస్తున్న సమయంలో కొందరు మీడియా ప్రతినిధులు ధర్నాకు సలహాదారులగా పనిచేశారు. జర్నలిస్టులగా సామాజిక బాధ్యతతో పనిచేస్తున్నారా? నాయకులకు బ్రోకరేజ్ చేస్తున్నారో అర్థం కావాట్లేదు. గోదావరి డెల్టాతో పాటు లక్షలాది మందికి బతుకునిస్తున్న గొంతేరు కాల్వని నాశనం చేసే గోదావరి మెగా ఆక్వాపుడ్ పార్కు నిర్మాణాన్ని విశ్వమానవవేదిక వ్యతిరేకిస్తోంది. రైతులు చేపట్టిన ఉద్యమం న్యాయబద్ధమైందని భావించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేలా కార్యక్రమాలు చేపడుతున్నాం. రైతు ఉద్యమం ఆధారం చేసుకుని విశ్వమానవవేదిక సంస్థపై కుట్ర ప్రారంభమైంది. విశ్వమానవవేదిక సభ్యులపై తప్పుడు కేసులు నమోదు చేసి అరెస్టులు చేయిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, మార్కెట్‌యార్డు కమిటీ గొట్టుముక్కల గాంధీ భగవాన్‌రాజులపై మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశాం. ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అనుచరుడు బట్టల వ్యాపారి తారక సత్యతో పాటు మరికొందరు నన్ను చంపడం అనే అంశం చాలా చిన్న విషయమని ఫేస్‌బుక్ ద్వారా పోస్టింగులు పెట్టారు. ఈ నేపథ్యంలో విశ్వమానవవేదిక వృద్ధాశ్రమంపై దాడి జరగడం చర్చనీయాంశంగా మారింది. పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ప్రోద్భలంతో విశ్వమానవవేదికపై జరుగుతున్న దాడులను అరికట్టాలని పాలకొల్లు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాం. వీడియో ఆధారాలు, ఫేస్‌బుక్లో చంపుతామనే హెచ్చరికలు ఆధారంగా మానవహక్కుల కమిషన్‌కి మరోసారి ఫిర్యాదు చేయబోతున్నాం. - - మల్లుల సురేష్, విశ్వమానవవేదిక అధ్యక్షుడు 9652256999 www.viswamanavavedika.com'
Tags: mallula suresh viswamanavavedika palakollu west godavari
See also:
comments